నోటి దుర్వాసనకు ఆయుర్వేద చిట్కాలు

నీటిలో యాలికలు, లవంగాలు వేసి బాగా మరిగించి తాగితే చాలు. నోటికి, జీర్ణానికి మంచిది.

త్రిఫల చూర్ణం, ఉసిరితో మరిగించిన నీరు మౌత్ వాష్‌లా పనిచేస్తుంది.

దాల్చిన చెక్కలోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రోపర్టీస్ చెడు వాసన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఆయుర్వేదం ప్రకారం నోటికి వేపాకు చాలా మంచిది.

కలబందను ఒక కప్పు వేడి నీటిలో కలిపి నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలు. దుర్వాసన మాయం.

మెంతి ఆకులను నీటిలో వేసి వేడి చేసి తాగితే చాలు. రోజంతా నోరు ఫ్రెష్‌గా ఉంటుంది.

తేనె, అల్లం, నిమ్మ కలిపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేయండి.

నోరు పొడిబారినా దుర్వాసన వస్తుంది. కాబట్టి, నీత్యం నీటిని తాగుతూ ఉండండి.

Images Credit: Pixabay and Pexels