హార్ట్ ఎటాక్‌కు ముందు మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చెస్ట్ పెయిన్: ఛాతిలో నొప్పితోపాటు అసౌకర్యంగా ఉంటుంది. ఎడమ చేయి లాగుతుంది. ఊపిరి ఆడకపోవడం: శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. కొవ్వు: బాగా బరువు పెరిగి, నడిచేప్పుడు ఆయాసం వస్తున్నా.. గుండెనొప్పికి దారితీయొచ్చు. బీపీ: అధిక బ్లడ్ ప్రెజర్ కూడా గుండె నొప్పికి దారితీస్తుంది. కాబట్టి, నిత్యం చెక్ చేసుకోవాలి. గుండె లయ తప్పడం: గుండె ఆగి ఆగి కొట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. కాబట్టి, తప్పక చెక్ చేసుకోవాలి. పంటి చిగుళ్ల సమస్య: చిగుళ్లలో పెరిగే బ్యాక్టీరియా చిగుళ్ల ద్వారా గుండెకు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. డయాబెటిస్: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు ఉంది. కిడ్నీ సమస్యలు: కిడ్నీ సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీయొచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించండి. మీకు 40 ఏళ్లు రాగానే ఫుల్ బాడీ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. అప్పుడే అప్రమత్తంగా ఉండగలం. Images Credit: Pixabay and Pexels