చక్కెరతో జాగ్రత్త, తియ్యగా చంపేస్తుంది!

ఏదైనా అతి మంచిది కాదు. అది తీపి కావచ్చు లేదా ఉప్పు కావచ్చు.

తీపి రెండు రకాలు: ఒకటి నేచురల్ సుగర్, రెండోది యాడెడ్ సుగర్.

నేచురల్ సుగర్ పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో ఉంటుంది. యాడెడ్ సుగర్ గురించి మీకు తెలిసిందే.

తీపి అతిగా తింటే డయాబెటిస్ మాత్రమే కాదు.. లివర్, గుండె సమస్యలు కూడా వస్తాయి.

చక్కెర అతిగా తినేవారు త్వరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే చక్కెరలో క్యాలరీలు కూడా ఎక్కువే.

అతిగా తీపి తింటే మొటిమలు, దద్దర్లు వంటి చర్మ సంబంధ సమస్యలు వస్తాయి.

రాత్రి నిద్రపోయే ముందు తీపి పదార్థాలు అస్సలు తినొద్దు. అవి నిద్రపై చెడు ప్రభావం చూపుతాయి.

తీపి వల్ల దంతాలు కూడా పాడైపోతాయి. దంతక్షయానికి కారణం యాడెడ్ చక్కెరే.

Images Credit: Pexels and Pixabay