ఉదయాన్నే పరగడుపున కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయ్. సిట్రస్ ఫ్రూట్స్: పుల్లగా ఉండే పదార్థాలేవీ ఉదయాన్నే తినొద్దు. గుండెలో మంట, అల్సర్ వస్తాయి. అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండే కీర దోసకాయను ఉదయాన్నే తింటే పొత్తికడుపున నొప్పి వస్తుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగితే అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సోడా డ్రింక్స్ తాగితే కడుపుకు రక్త ప్రవాహం తగ్గి జీర్ణ సమస్యలు వస్తాయి. ఉదయాన్నే ఘాటైన ఆహారాన్ని తింటే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. టమోటోలో ఎసిడిటీకి కారణమయ్యే ట్యాన్నిన్ ఉంది. కాబట్టి ఉదయాన్నే వద్దు. ఈస్ట్‌తో తయారయ్యే బిస్కట్లు, పఫ్, ప్యాస్ట్రీ, వెనిగర్, బీర్, వైన్ కూడా వద్దు. Images Credit: Pixabay and Pixels