శరీరానికి ఎనర్జీని ఇచ్చే ఎలక్ట్రోలైట్స్ లభించేది వీటిలోనే! ఎలక్ట్రోలైట్స్‌లోని మినరల్స్ శరీరానికి శక్తినిస్తాయి. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. ఎలక్ట్రోలైట్స్ ఈ కింది ఆహారపానియాల్లో పుష్కలంగా లభిస్తాయి. అవేంటో చూసేయండి మరి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలం. ఇందులో పొటాషియం, సోడియం, క్లోరైడ్ ఉంటాయి. కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. జీడిపప్పు, వేరుశనగ, బాదాంల్లో కూడా ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాల్లో సైతం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుతాయి. ఆవు పాలలోనూ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పాలలో పాస్పరస్, కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. Images and Videos Credit: Pexels and Pixabay