వేసవిలో మీ స్మార్ట్ ఫోన్ పేలకుండా ఉండాలంటే!

Published by: Jyotsna

​స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా సూర్యరశ్మిలో ఉంచవద్దు, ముఖ్యంగా కార్ డాష్‌బోర్డ్ లేదా బహిరంగ ప్రదేశాలలో

​ఫోన్‌ను అవసరానికి మించి చార్జింగ్‌లో ఉంచవద్దు, ఇది బ్యాటరీపై ఒత్తిడిని పెంచుతుంది.

ఎల్లప్పుడూ ఒరిజినల్ చార్జర్ మరియు బ్యాటరీని మాత్రమే ఉపయోగించండి

ఫోన్ ఎక్కువగా వేడెక్కితే వెంటనే ఉపయోగించడం ఆపి, చల్లని ప్రదేశంలో ఉంచండి.

​పవర్ సేవింగ్ మోడ్‌ను ఉపయోగించండి, ఇది బ్యాటరీ వేడెక్కడాన్ని, ప్రాసెసర్‌పై లోడ్‌ను తగ్గిస్తుంది.

​ఫోన్ ఎక్కువగా వేడెక్కితే దాని కవర్‌ను తొలగించండి, త్వరగా చల్లబడుతుంది

ఫోన్ అవసరానికి మించి వేడెక్కితే, కొంతసేపు ఆఫ్ చేసి, చల్లబడే వరకు వేచి ఉండండి.