సీఎంఎఫ్ ఫోన్‌పై సూపర్ ఆఫర్ - ఇప్పుడు రూ.13 వేలకే! నథింగ్ కంపెనీ సబ్ బ్రాండ్‌గా సీఎంఎఫ్ అనే బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ సీఎంఎఫ్ ఫోన్ 1 పేరుతో మార్కెట్లో తన మొదటి ఫోన్‌ను విడుదల చేసింది. సీఎంఎఫ్ ఫోన్ 1 ధర లాంచ్ అయినప్పుడు రూ.15,999గా ఉండేది. ఇప్పుడు దీని ధర రూ.14,999కు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు లభించనుంది. అంటే దీన్ని రూ.12,999కే కొనేయచ్చన్న మాట. దీంతోపాటు మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8,600 వరకు మరింత డిస్కౌంట్ అందించనున్నారు. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్ కూడా అందించారు.