నీళ్లు తాగేప్పుడు చేసే చిన్న తప్పులు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే నీళ్లు తాగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. నీరు తాగితే మంచిదే కానీ ఎక్కువగా తాగితే హెల్త్‌కి మంచిది కాదు. ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. కొందరు దాహం వేస్తున్నా సరే తాగకుండా నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం వల్ల మీరు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంది. చాలామంది నించుని నీరు తాగేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా తాగడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. కొందరు ఆత్రంగా పెద్ద గుటకలు వేస్తూ నీరు తాగేస్తారు. ఇలా తాగితే అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి చిన్నగా సిప్ చేస్తూ నీటిని తాగాలి. (Image Source : Pexels)