ఉదయాన్నే అంగం దానికదే స్తంభిస్తుందా? అయితే, ఇది మీకు గుడ్ న్యూసే ఉదయాన్నే అంగస్తంభన జరగకపోతే మాత్రం.. ఇది మీకు బ్యాడ్ న్యూసే! క్రమం తప్పకుండా ఉదయం అంగస్తంభన గల పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారట. అలాంటివారికి.. గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటి వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువట. ఈ పరిశోధన కోసం నిపుణులు.. బెల్జియంలో సుమారు 1,800 మందిపై 12 ఏళ్లు నిఘా పెట్టారు. ఉదయం అంగ స్తంభన కలిగే వ్యక్తులు తక్కువ వయస్సులోనే చనిపోయే అవకాశాలు తగ్గాయట. రాత్రి, ఉదయం వేళల్లో అంగ స్తంభనలు కలగడం మంచి రక్త ప్రసరణకు సంకేతం. రాత్రి నిద్రలో మీకు తెలియకుండానే ఐదు సార్లు అంగస్తంభనలు జరుగుతాయట. టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల ఉదయం వేళల్లో కూడా అంగస్తంభన జరుగుతుందట. ధమనులు సరిగ్గా పని చేయకపోతే ఉదయం వేళల్లో అంగ స్తంభన జరగదని నిపుణులు తెలిపారు. ఈ సమస్య ఏర్పడిన మూడు, నుంచి ఐదు సంవత్సరాల్లో గుండెపోటు లేదా స్ట్రోక్‌కు గురవ్వుతారట. గమనిక: తాజా పరిశోధనల ఆధారంగా ఈ వివరాలను అందించామని గమనించగలరు.