తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. వరుస ఆఫర్స్ అందుకుంటున్న నివేదా 'అలవైకుంఠపురంలో' సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'పాగల్'లో మెప్పించింది. ప్రస్తుతం నివేదా పేతురాజ్ చేతిలో రెండు తెలుగు సినిమాలు, ఓ తమిళ మూవీ ఉంది. తెలుగులో ఆమె నటించిన 'విరాటపర్వం' విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే చందు మొండేటి దర్శకత్వంలో సినిమా మరొక సినిమా చేయబోతుంది. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ లో పాల్గొంది. వైట్ కలర్ ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది నివేతా.