పనసపొట్టు కూర... అదిరేలా

పనసపొట్టు కూర గోదావరి జిల్లాల్లో చాలా పాపులర్. ఆ రుచిని మీరూ ఆస్వాదించాలంటే ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

పనసపొట్టు - రెండు కప్పులు
శెనగపప్పు - ఒక టీస్పూను
మినపప్పు - ఒక టీస్పూను
ఆవాలు - రెండు స్పూనులు
పసుపు - అర టీస్పూను
ఉప్పు - తగినంత
జీలకర్ర - ఒక టీస్పూను

పచ్చిమిర్చి - అయిదు
ఎండు మిర్చి - పది
చింతపండు - చిన్న ఉండ
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - గుప్పెడు
జీడిపప్పులు - ఎనిమిది
నూనె - మూడు స్పూనులు

తురిమిన పనసపొట్టును నీళ్లలో వేసి, కాస్త పసుపు,ఉప్పు వేసి ఉడికించాలి. తరువాత వడకట్టేయాలి.

మరోపక్క ఆవాలు, ఎండుమిర్చిని కాస్త వేయించి పొడిలా చేసి పెట్టుకోవాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, మిపప్పప్పు, శెనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.

అరకప్పు చింతపండు నీళ్లను వేసి, చిటికెడు ఇంగువ పొడి వేసి వేయించాలి.

అవి దగ్గరగా అయ్యాక పనసపొట్టు, ఉప్పు వేసి వేయించాలి.

కూర బాగా ఉడికాక స్టవ్ కట్టేయడానికి అయిదు నిమిషాల ముందు, ఆవ పిండిని చల్లి బాగా కలుపుకోవాలి.