ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నకిలీ నోట్ల బెడద తప్పడం లేదు! దొంగనోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలో ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ (FICN)గా పిలుస్తారు. ఈ నోట్లను చలామణీలోకి తెస్తే జీవితఖైదు విధిస్తారు. ఏటీఎంలో దొంగనోట్లు గుర్తించిన వెంటనే సీసీటీవీ ముందు నిలబడి నోటు ముందు, వెనకవైపు చూపించాలి. దొంగనోటు గురించి అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలియజేయాలి. ఆ ఏటీఎం లావాదేవీకి సంబంధించిన రిసిప్టును భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు వెళ్లి దానిని డిపాజిట్ చేయాలి. వారికి ఏటీఎం రిసిప్టు చూపించాలి. బ్యాంకు అధికారులు తమ నిబంధనలను అనుసరించి అసలు నోటును ఇస్తారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి దొంగనోట్లు వస్తే సాధ్యమైనంత త్వరగా కస్టమర్‌కు అసలు నోట్లు ఇవ్వాలి. బ్యాంకు ఇందుకు నిరాకరిస్తే ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది.