జూన్ 16 గురువారం రాశిఫలాలు



మేషం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. తెలుపు, పసుపు రంగులు మీకు కలిసొస్తాయి.



వృషభం
అష్టమ శని ఉన్నప్పటికీ వ్యాపారం బాగానే సాగుతుంది.ధనం చేతికందుతుంది. చంద్రుడు, శని కారణంగా ఆరోగ్యం అంతగా బావోదు. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది. ఆకుపచ్చ, ఆకాశం రంగు మీకు కలిసొస్తాయి.



మిథునం
మీ రాశిలో బృహస్పతి మరియు చంద్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ప్రయాణాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. ఆకుపచ్చ , ఊదా రంగులు కలిసొస్తాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.



కర్కాటకం
ఈ రోజు వ్యాపారంలో విజయం సాధించే సమయం. విద్యార్థులు తమ కెరీర్‌లో గందరగోళానికి గురవుతారు. తెలుపు, ఎరుపు రంగులు మంచివి. శ్రీ మహా విష్ణువును పూజించండి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.



సింహం
సూర్యుడు పదకొండో స్థానంలో సంచరించడం వల్ల మీకు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ధనం చేతికందుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభిస్తాయి. పసుపు, ఎరుపు రంగులు మీకు మంచివి. శ్రీ సూక్తం చదవండి, గోధుమలు దానం చేయండి.



కన్య
ఈ రోజు మీకు అంతా శభకరంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు. శుక్రుడి సంచారం వల్ల బ్యాంకింగ్ ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. ఆరెంజ్, స్కై బ్లూ మీకు కలిసొచ్చే రంగులు.



తులా
వ్యాపారంలో పురోగతితో ఆనందంగా ఉంటుంది.విద్యార్థులు పోటీపరీక్ష్లలో సక్సెస్ అవుతారు. కనకధార స్తోత్రాన్ని పఠించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీకు కలిసొచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ.



వృశ్చికం
ఈ రోజు ఉద్యోగులకు అంతా శుభసమయం. నువ్వులు దానం చేయండి. వైవాహిక జీవితంలో నమ్మకాన్ని నిలబెట్టుకోండి. భూములు కొనుగోలు చేసే సూచనలున్నాయి. సూర్యారాధన చేయండి. వైలెట్, స్కై బ్లూ శుభప్రదం



ధనుస్సు
ఈ రాశిలో బృహస్పతి, మిధునరాశిలో సూర్యుడు ఉన్నారు. వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి మీరు శుభవార్త అందుకుంటారు. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. తెలుపు, నీలం రంగులు మీకు మంచివి.



మకరం
ఈ రాశి నుంచి చంద్రుడు పెన్నెండో స్థానంలో , శని రెండో స్థానంలో ఉండడంతో ఆర్థిక ప్రయోజనాలుంటాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. మతపరమైన ఆచారాలు ఫాలో అవుతారు. ఆరెంజ్, ఊదారంగులు మీకు కలిసొస్తాయి.



కుంభం
ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు మంచి రోజు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది.వ్యాపారులకు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో అసలత్వం వద్దు. వైలెట్, నీలం మీకు కలిసొస్తాయి.



మీనం
శుక్రుడు,బుధుడు సంచారం వల్ల ధనలాభం ఉంటుంది. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. రాజకీయ నాయకులకు కలిసొచ్చే రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎరుపు, పసుపు మీకు కలిసొచ్చే రంగులు.