దీపాన్ని ఈ దిశగా అస్సలు పెట్టకూడదు



దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”



దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తారు.



షోడశోపచారాల్లో దీపం ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు.



దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు



తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు



పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.



ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి.



దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. ఎందుకంటే అది యముడి స్థానం. ఈ దిశగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధలు



సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”



మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం.



Images Credit: Pinterest