అన్నీ ఉన్నా ఆత్మహత్యలెందుకు? ప్రత్యూష గరిమెళ్ల... ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్.ఆర్ధికంగా, సామాజికంగా ఎలాంటి లోటు లేదు. అయినా ఆత్మహ్యత చేసుకున్నారు. ప్రత్యూష ఆత్మహత్యకు డిప్రెషన్ బారిన పడడమే కారణమని తేల్చారు పోలీసులు. ఒంటరితనం కారణంగా అధిక శాతం మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. తమకు ఎంతో ఇష్టమైనవారిని కోల్పోయినప్పుడు, భయంకరమైన రోగాల బారిన పడినప్పుడు ఇలాంటి కుంగుబాటు కలిగే అవకాశం ఉంది. అలాగే వరుస వైఫల్యాల బారిన పడుతున్న వ్యక్తి కూడా మానసికంగా కుంగి డిప్రెషన్ లోకి వెళతాడు. డిప్రెషన్ అనేది హఠాత్తుగా కలిగే పరిణామం కాదు. కొన్ని నెలలు లేదా రోజుల పాటూ సాగే ప్రక్రియ. డిప్రెషన్ నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయి. దానికి చికిత్స కూడా ఉంది. తీవ్రంగా డిప్రెషన్ బారిన పడినవారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని అందిస్తారు. యాంటీ డిప్రెసెంట్ మందులను సూచిస్తారు.వాటి ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు.