అనసూయకు ఉన్నంత క్రేజ్ బుల్లితెర రంగంలో మరే యాంకర్‌కు లేదు. అందుకే, అనసూయ అంత పాపులారిటీ సంపాదించింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా అనసూయ కేరీర్ ప్లాన్ చేసుకుంది. ఒక పక్క టీవీ షోస్, మరోపక్క సినిమాలతో అనసూయ చాలా బిజీగా ఉంటోంది. బిజీ షెడ్యూల్ వల్ల అనసూయ నిద్రాహారాలు మానుకొని మరీ పనిచేస్తోంది. తాజాగా ఆమె తెల్లవారుజాము 4 గంటలకు కారులో ప్రయాణిస్తున్న వీడియో పెట్టింది. ఆ తర్వాత పెట్టిన వీడియోలో ఆమె నిద్రలేక పడుతున్న తిప్పలు గురించి చెప్పింది. ‘‘నిద్ర కరువైంది, అయినా బతికే ఉన్నా’’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. పాపం, అనసూయ కష్టం చూస్తుంటే జాలేస్తోంది కదూ. Images and Videos Credit: Anasuya/Instagram