‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య నాగళ్ల. ఆ తర్వాత ఆమె ‘వకీల్ సాబ్’, ‘ప్లే బ్యాక్’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తోంది. అందాల ఆరబోతకు వెనుకాడని అనన్య మంచి ‘బ్రేక్’ కోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారి హీరోయిన్‌గా క్లిక్కైతే.. తిరుగే ఉండదని భావిస్తోంది. అవకాశాలు రాలేదని డీలా పడకుండా లైఫ్‌ను మస్త్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అనన్య పులితో ఆటలాడుతూ కనిపించింది. పులి దగ్గర కూర్చొని, దాన్ని టచ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘ఈ పులులకు మత్తు ఇవ్వలేదు. పుట్టినప్పటి నుంచే మనుషులతో పెరిగాయి’’ అని అనన్య తెలిపింది. ‘‘ఈ పులులు మనుషుల మధ్యే తిరుగుతాయి’’ అని అనన్య పేర్కొంది. Images and Videos Credit: Ananya Nagalla/Instagram