నేడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను 'సూపర్ స్టార్' చేసిన 10 బెస్ట్ ఫిల్మ్స్ ఏంటో తెలుసుకుందాం!
Image Source: Twitter
మహేష్ బాబు హీరోగా పరిచయమైన సినిమా 'రాజకుమారుడు'. ఈ మూవీతో మహేశ్ సక్సెస్ ఫుల్ గా లాంచ్ అవ్వడమే కాదు, బెస్ట్ డెబ్యూ హీరోగా నంది అవార్డు అందుకున్నాడు.
Image Source: twitter
మహేశ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా 'మురారి'. ఇందులో ఓవైపు చిలిపి చేష్టలతో నవ్విస్తూనే, మరోవైపు ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించాడు.
Image Source: twitter
నటుడిగా మహేష్ ను మరో మెట్టు ఎక్కించిన చిత్రం 'నిజం'. రిజల్ట్ ఎలా ఉన్నా, తనకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆయన నటనకు గాను నంది అవార్డు వరించింది.
Image Source: twitter
మహేష్ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా 'ఒక్కడు'. బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, అప్పటికి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
Image Source: twitter
మహేష్ జీవితంలో మర్చిపోలేని సినిమా 'పోకిరి'. ఈ చిత్రం 200 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ₹70 కోట్లు వసూలు చేసి, టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
Image Source: twitter
మహేశ్ బాబు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో 'ఖలేజా' ఒకటి. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినప్పటికీ, మహేశ్ లోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసింది.
Image Source: twitter
మహేష్ ను టాలీవుడ్ స్టార్ హీరోలలో అగ్ర స్థానంలో నిలిపిన చిత్రం 'దూకుడు'. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా నిలవడమే కాదు, 100 కోట్ల క్లబ్ లో చేరింది.
Image Source: twitter
యాక్టింగ్ పరంగా 'బిజినెస్ మ్యాన్' సినిమా మహేష్ లోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఇంటెన్స్ యాక్టింగ్ తో, తన అద్భుతమైన డైలాగ్ డెలివరీతో కట్టిపడేసాడు.
Image Source: twitter
తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ కు నాంది పలికిన సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్ తో కలిసి నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా, మహేశ్ కు మరో బ్లాక్ బస్టర్ అందించింది.
Image Source: twitter
మహేశ్ బాబు కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, ఉత్తమ నటుడిగా ఎనిమిదో నంది అవార్డు తెచ్చిపెట్టింది.
Image Source: twitter
మహేశ్ బాబును మరో మెట్టు ఎక్కించిన సినిమా 'భరత్ అనే నేను'. ఈ చిత్రం నుంచే అపజయం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతున్నారు మన సూపర్ స్టార్.