ఆల్కహాల్ తాగకపోయిన కాలేయ సమస్యలు



లివర్ సిర్రోసిస్ వ్యాధి ఆల్కహాల్ తాగే వారిలోనే వస్తుందని అనుకుంటారు.



ఆల్కహాల్ తాగని వారిలో కూడా ఈ లివర్ సిర్రోసిస్ వ్యాధి వస్తుంది.



ఆల్కహాల్ తాగే అలవాటు లేని వారిలో లివర్ సమస్యలు వస్తున్నాయంటే వారి ఆహార నియమాలు సరిగా లేవని అర్థం.



మధుమేహం, హైపోథైరాయిడ్, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం,హెపటైటిస్ సి వంటి సమస్యలు ఉన్నవారికి కూడా లివర్ సిర్రోసిస్ వ్యాధి రావచ్చు.



ఈ లివర్ సిర్రోసిస్ సమస్య వస్తే కాలేయం గట్టి పడిపోతుంది. మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం.



ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక శ్రమ లేని వారిలో కాలేయం త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంది.



జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. వీటి వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి కాలేయం దెబ్బతింటుంది.



నలభై ఏళ్ల వయసు దాటిన ప్రతివారు ఏడాదికి ఒకసారి కాలేయం ఎలా పనిచేస్తుందో లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి.