జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

దిల్: నితిన్, వినాయక్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీని ముందుగా దర్శకుడు ఎన్టీఆర్ కు చెప్పారు. కానీ, ఆయన రిజెక్ట్ చేశారు.

ఆర్య: సుకుమార్ ఈ మూవీ స్టోరీని ముందు ఎన్టీఆర్ కు చెప్పారు. కానీ, తనకు ఆ క్యారెక్టర్ సూట్ కాదని వదులుకున్నారు.

అతనొక్కడే:ముందుగా ఈ సినిమా ఎన్టీఆర్ తో చేయాలని భావించారు సురేందర్ రెడ్డి. కానీ, తను నో చెప్పడంతో కల్యాణ్ రామ్ తో చేశారు.

భద్ర: ముందుగా ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నారు బోయపాటి. తను నో చెప్పడంతో రవితేజతో చేశారు.

కృష్ణ: వినాయక్ ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు. కానీ, ఆయన రిజెక్ట్ చేయడంతో రవితేజతో చేశారు.

కిక్: ఈ సినిమా కథ కూడా ముందగా ఎన్టీఆర్ దగ్గరికే వచ్చింది. తను నో చెప్పడంతో రవితేజతో చేశారు సురేందర్ రెడ్డి.

ఎవడు: వంశీ పైడిపల్లి తొలుత ఈ సినిమాకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో చేయాలి అనుకున్నారు. వారు నో చెప్పడంతో చెర్రీ, బన్నీతో చేశారు.

శ్రీమంతుడు: ఈ సినిమా కథను కొరటాల ముందుగా ఎన్టీఆర్ కు చెప్పారు. తను చేయలేను అని చెప్పడంతో మహేష్ చేశారు.

ఊపిరి: ఈ సినిమాలో కార్తీ పాత్రను ఎన్టీఆర్ తో చేయించాలి అనుకున్నారు దర్శకుడు వంశీ. ఆయన రిజెక్ట్ చేశారు.

బ్రహ్మోత్సవం: దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముందుగా ఎన్టీఆర్‌కి కథ చెప్పాడు. ఆయన కాదనడంతో మహేష్ తో చేశారు.

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా: ఈ సినిమా కథ మందు ఎన్టీఆర్ దగ్గరికే వచ్చింది. తను నో చెప్పడంతో బన్నీ చేశారు.

శ్రీనివాస కళ్యాణం: ఈ మూవీని ఎన్టీఆర్ తో చేయాలని దర్శకుడు సతీష్ భావించారు. కానీ, జూనియర్ ఓకే చెయ్యలేదు.