బ్లాక్ కాఫీతో బరువు తగ్గుతారట - ఇదిగో ఇలా తయారు చెయ్యండి USDA రిపోర్టు ప్రకారం బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ మేలు చేస్తుంది. ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. క్లోరోజెనిక్ యాసిడ్ బరువు వేగంగా తగ్గిచండంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీ తయారీకి 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీ, 1 కప్పు ఫిల్టర్ చేసిన పాలు ఒక బౌల్లో ఫిల్టర్ చేసిన నీటిని తీసుకుని మీడియం మంట మీద వేడి చేయండి. అందులో కాఫీ పొడి వేసి రుచి కోసం తేనె, దాల్చిన చెక్క లేదా చక్కెర వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించండి. ఒక కప్పులో వేడి బ్లాక్ కాఫీని వడకట్టి మీకు నచ్చిన కుకీలతో ఆస్వాదించండి. వ్యాయామానికి అరగంట ముందు బ్లాక్ కాఫీ తాగితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు.