చక్కటి ఆరోగ్యానికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
కొందరిలో సరిపడ నిద్రపోయినా ఇంకా నిద్రమత్తుగానే ఉంటుంది.
అలాంటి వారిలో హైపర్ సోమ్నియా ఉన్నట్లు గుర్తించాలి.
ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, డీహైడ్రేషన్, ఒత్తిడితో హైపర్ సోమ్నియా ఏర్పడుతుంది.
హైపర్ సోమ్నియా కారణంగా ఆకలి లేకపోవడం, పనిలో ఏకాగ్రత లోపిస్తుంది.
చిరాకు పెరగడంతో పాటు అలసట, మతిమరుపు వస్తుంది.
హైపర్ సోమ్నియా నుంచి బయటపడేందుకు టీ, కాఫీ తాగాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం, తల స్నానం చేయాలి. నీరు ఎక్కువగా తాగాలి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com