మలబద్ధకం అనేది చాలా కారణాలతో ముడిపడి ఉంటుంది. కానీ ఫుడ్స్ కీలకపాత్ర పోషిస్తాయి.

అలాగే డీహైడ్రేషన్​ కూడా మలబద్ధకానికి దారి తీస్తుంది. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి అంటారు.

మరి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తినకూడని ఫుడ్స్ ఉన్నాయా?

డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ పరిస్థితిని ఇంకా దారుణం చేసి.. సమస్యను పెంచుతాయి.

షుగర్ కలిగిన ఫుడ్స్ జీర్ణ సమస్యలను పెంచి.. మలబద్ధకానికి దారితీస్తాయి.

వైట్ బ్రెడ్ కూడా మంచిది కాదు. దీనిని మీరు మల్టీగ్రైన్ బ్రెడ్​తో రిప్లేస్ చేయొచ్చు.

కెఫీన్ డీ హైడ్రేషన్​ను పెంచుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారి తీస్తుంది.

రెడ్ మీట్​లో ప్రోటీన్​, ఫ్యాట్ ఉంటుంది. కానీ ఫైబర్ తక్కువ. కాబట్టి దీనిని తినకపోవడమే మంచిది.

ఫైబర్ ఎక్కువ కలిగిన ఫుడ్స్ తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే ఇంకా మంచిది. (Images Source : Envato)