పీరియడ్స్ సమయంలో చాలామంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా బాడీ పెయిన్స్, కడుపు నొప్పి ఇబ్బంది పెడతాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో హీటింగ్ ప్యాడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. రెగ్యూలర్గా వ్యాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. అరోమా థెరపీ కూడా నొప్పిని దూరం చేస్తుంది. దానితో మసాజ్ చేసుకుంటే మంచిది. ఆల్కహాల్, కెఫిన్ కలిగిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మానేస్తే ఇంకా మంచిది. హెర్బల్ టీలు కూడా పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పెయిన్ను తగ్గించే పెయిన్ రిలీఫ్ ప్యాచ్లు ఉంటాయి. నొప్పి ఎక్కువగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. (Images Source : Envato)