ఆ సమస్యలుంటే మహిళలు బొప్పాయి తినకూడదట

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

బొప్పాయి ఒక పోషకమైన పండు. ఇందులో విటమిన్ A, C, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి.

Image Source: freepik

ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Image Source: freepik

అయితే ఆరోగ్యానికి మంచిదే అయినా ప్రతి మహిళ బొప్పాయి తినడం మంచిది కాదు.

Image Source: freepik

గర్భధారణ ప్రారంభ నెలల్లో మహిళలు పచ్చి బొప్పాయి తినకుండా ఉండాలి.

Image Source: freepik

పచ్చి బొప్పాయిలో లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భాశయంలో సంకోచాలను కలిగిస్తుంది.

Image Source: freepik

పదే పదే గర్భస్రావం అయిన మహిళలు వైద్యుల సలహా లేకుండా బొప్పాయి తినకూడదు.

Image Source: freepik

లేటెక్స్ అలర్జీ ఉన్నవారు బొప్పాయి తినే ముందు జాగ్రత్త వహించండి.

Image Source: freepik

ఎవరికైనా కడుపులో పుండు లేదా తీవ్రమైన గ్యాస్ సమస్య ఉంటే.. ఎక్కువ బొప్పాయి తినడం హానికరం కావచ్చు.

Image Source: freepik

శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న మహిళలు కూడా వైద్యులను సంప్రదించిన తర్వాతే బొప్పాయి తినాలి.

Image Source: freepik