చాలా మంది నిద్ర లేచేందుకు అలారం పెట్టుకుంటారు.
కానీ, అలారం సౌండ్ తో నిద్రలేవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
అలారం మోత కారణంగా బీపీ విపరీతంగా పెరుగుతున్నట్లు తేలింది.
సహజంగా నిద్రలేచే వారితో పోల్చితే 74 శాతం ఎక్కువ బీపీ పెరుగుతుంది.
అకస్మాత్తుగా బీపీ పెరగడం గుండెతో పాటు సిరలపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.
అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ఏర్పడే అవకాశం ఉంది.
ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ముప్పు కలుగుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com