తినేముందు మామిడి పండ్లను నీళ్లలో ఎందుకు నానబెట్టాలి మామిడిలో ఉండే ఫైటిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. మామిడికాయలను నీళ్లలో నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. మంచి పోషకాలు అందుతాయి. నీటిలో నానబెట్టడం వల్ల పురుగుమందు అవశేషాలు, పైన ఉండే మురికి తొలగిపోతుంది. మామిడిపండ్లను నానబెట్టడం వల్ల దాని తొక్కను తీయడం సులభమవుతుంది. మామిడిపండ్లను నానబెట్టడం వల్ల అందులో ఉండే ఫైటోకెమికల్స్ గాఢత తగ్గుతుంది. నానబెడితే మామిడిపండు రుచి పెరుగుతుంది. జ్యూసీగా, తియ్యగా మారుతుంది. నానబెట్టిన మామిడి తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. నానబెట్టిన మామిడిపండ్లను రిఫ్రెష్ ట్రీట్ చేయవచ్చు. వేసవిలో ఇది ఆరోగ్యానికి మంచిది.