Image Source: Pexels

అమ్మాయిలు మైదా తినకూడదా? అంత ప్రమాదమా?

మైదా పిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.

బజ్జీలు, పూరీల నుంచి కేకులు, బిస్కెట్లు.. ఇలా చాలా పదార్థాలు మైదాతోనే చేస్తారు.

అయితే, ఆహార నిపుణులు అమ్మాయిలు మైదాతో చేసే ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇందుకు కారణం.. మహిళల్లో సాధారణంగా వచ్చే పాలిసిస్టిక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS).

దీనివల్ల మహిళలు హార్మోన్లు అసమతుల్యత తదితర అనారోగ్య సమస్యలకు గురవ్వుతారు.

ఈ సమస్య ఉండే మహిళల్లో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. అండాశయాల్లో తిత్తులాంటివి ఏర్పడతాయి.

PCOS కలిగిన మహిళల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది.

దానివల్ల వారు డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

మైదా ఎక్కువగా తినే మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

PCOS ఉన్న మహిళలు మద్యం, స్వీట్స్, రెడ్ మీట్, ఉప్పు, కెఫీన్ ఎక్కువగా తీసుకోకూడదు.

Image Source: Pexels

నోట్: ఈ వివరాలు మీ అవగాహన కోసమే. మరిన్ని సూచనల కోసం డాక్టర్‌ను సంప్రదించగలరు.