అబ్బాయిలూ.. ఉదయాన్నే ఇలా కాకపోతే ఆలోచించాల్సిందే, ఎందుకంటే.. కొంతమంది అబ్బాయిలకు తెలియకుండానే ఉదయం వేళల్లో అంగం స్తంభిస్తుంది. ఎలాంటి లైంగిక ప్రేరణ లేకుండానే.. అబ్బాయిల్లో అలా జరుగుతుంది. దానివల్ల కొందరు చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఒంటరిగా నిద్రపోతే పర్వాలేదు. ఫ్యామిలీతో ఉన్నప్పుడే సమస్య. అయితే, దాని గురించి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలా కాకపోతేనే బాధపడాలి.. ఆలోచించాలి. ఎందుకంటే.. ఉదయాన్నే జరిగే అంగస్తంభన మీ లైంగిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఉదయాన్నే అలా జరుగుతుందంటే.. మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు హెల్దీగా ఉన్నట్లు అర్థం. టెస్టోస్టెరాన్ అనేది పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే హార్మోన్. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. టెస్టోస్టెరాన్ మానసిక ఆరోగ్యం, ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వేళ ఉదయాన్నే మీకు అలా జరగకపోతున్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించండి.