నిద్రలో చొంగ కారడం సర్వ సాధారణమే. కానీ, కొందరు అతిగా చొంగ కార్చుతూ ఇబ్బందిపడతారు.

చొంగ అంటే మరేదో కాదు.. నోటిలో ఊరే లాలాజలమే. నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది.

నిద్రలో ఉన్నప్పుడు ముఖ కండరాలు రిలాక్స్‌ అవుతాయి. అందువల్ల నోరు తెరుచుకుని లాలాజలం బయటకు కారుతుంది.

నిద్రలో చొంగ కార్చడం రోగమా? కారణాలేమిటీ?

వైద్య పరిభాషలో దీన్ని సియలోరియా అని కూడా అంటారు. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.

హైపర్సలైవేషన్, ముక్కు దిబ్బడ, స్లీప్ అప్నియా, నాడీ సమస్యలు, గర్భం, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ కూడా కారణం.

మెదడుకు గాయం, స్ట్రోక్, పార్కిన్సన్స్ వ్యాధి, సెరెబ్రల్ పాల్సీ వంటి సమస్యలు కూడా చొంగకు కారణం కావచ్చు.

అయితే, దీనిపై ఆందోళన వద్దు. ఈ సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తుంటే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి.

పక్కకు లేదా బోర్లా నిద్రపోయినా, నోరు తెరిచి ఊపిరి పీల్చుతున్న చొంగ ఎక్కువ కారుతుంది.

Image Credit: Pexels