Image Source: Pexels and Pixabay

పెళ్లిని ఎవరు, ఎందుకు కనిపెట్టారు?

ఈ పెళ్లిని కనిపెట్టింది ఎవడ్రా బాబు.. అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?

పెళ్లి అనే కాన్సెప్ట్ సుమారు 4,350 ఏళ్ల కింద నుంచే ఉందట.

లక్కీగా.. పెళ్లిని కనిపెట్టిన వ్యక్తి వివరాలేవీ చరిత్రలో లేవు. కానీ, దానికి కారణాలు మాత్రం ఉన్నాయి.

ఒకప్పుడు ప్రజలంతా బృందాలుగా కలిసి ఉండేవారట. విచ్చలవిడిగా పిల్లలను కనేవారట.

అయితే, వారి పోషణ బాధ్యతలు, ఆహారం, బంధాలు తదితర అంశాలన్నీ గందరగోళంగా ఉండేవట.

అప్పుడే.. పెళ్లి అనే ఐడియా పుట్టిందట. ఒక మగాడు లేదా మహిళ తనకు నచ్చిన వ్యక్తితో ఉండాలనే రూల్ పెట్టారట.

ఆ జంటకు పుట్టే బిడ్డల బాధ్యతలను వారే చూసుకోవాలని, ఆహారాలను వారే సమకూర్చుకోవాలని చెప్పారట.

అది కాలక్రమేనా పెళ్లిగా మారింది. ప్రపంచంలో మొదటి పెళ్లి క్రీస్తు పూర్వం 2350లో జరిగిందట.

అప్పట్లో కులమత సంబంధాలు లేకుండానే పెళ్లిల్లు జరిగేవట. గ్రీకులు, రోమన్లు పెళ్లికి బాగా విలువ ఇచ్చేవారట.

Image Source: Pexels and Pixabay

ప్రపంచంలో కెల్లా ఇండియాలోని వివాహ వ్యవస్థే బలమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి.