ఏ విటమిన్ లోపిస్తే Heart Weak అవుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ K రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది గాయం సమయంలో అధిక రక్తస్రావం కాకుండా నిరోధిస్తుంది.

చిగుళ్ల నుంచి రక్తం కారడం, తరచుగా ముక్కు నుంచి రక్తం రావడం లేదా శరీరంలో నీలి రంగు మచ్చలు ఏర్పడితే.. అది ఈ విటమిన్ లోపం వల్ల కావచ్చు.

ఎముకల బలానికి ఇది 'ఆస్టియోకాల్సిన్' ప్రోటీన్ను సక్రియం చేస్తుంది. ఇది కాల్షియాన్ని ఎముకలతో బంధించే పని చేస్తుంది.

విటమిన్ K లోపం వల్ల కాల్షియం సరిగ్గా ఉపయోగించుకోదు. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. బోలు వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

హృదయ ఆరోగ్యానికి ఇది ధమనులలో కాల్షియంను అనవసరంగా పేరుకుపోకుండా నిరోధిస్తుంది. తద్వారా రక్త ప్రవాహం కంట్రోల్ అవ్వదు.

ధమనులు గట్టిపడితే రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి తీవ్రమైన ప్రమాదానికి దారి తీస్తుంది.

నవజాత శిశువులలో అంతర్గత రక్తస్రావం నివారించడానికి పుట్టిన వెంటనే విటమిన్ K ఇంజెక్షన్ ఇవ్వడం చాలా అవసరం.

ఆ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ వంటి ఆకుకూరలు, గుడ్డు సొన లేదా పులియబెట్టిన ఆహారాలను చేర్చాలి.

ఏదైనా సప్లిమెంట్లను ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల పర్యవేక్షణలో హెల్త్ టిప్స్ ఫాలో అవ్వాలి.