Image Source: pexels

వేసవిలో కొబ్బరి నీళ్లు మంచివా? నిమ్మకాయ నీళ్లా?

సమ్మర్ లో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండాలంటే కొన్ని రకాల పానీయాలు కచ్చితంగా తాగాలి.

ఎండాకాలంలో కొబ్బరినీళ్లు, లెమన్ వాటర్‌లో ఏది మంచిది. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి అధికంగా అందుతాయి. దీన్ని నేచర్స్ స్పోర్ట్స్ డ్రింక్ అంటారు.

ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటుంది. నరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

కొబ్బరి నీళ్లలో కార్బొహైడ్రేట్లు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ చక్కరలు కూడా ఉంటాయి. వీటిని తాగితే శరీరానికి శక్తి వస్తుంది.

నిమ్మకాయలో సిట్రస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

రోగనిరోధక వ్యవస్థకు చర్మ ఆరోగ్యానికి లెమన్ వాటర్ ముఖ్యమైంది. జీర్ణక్రియకు సహాయపడతాయి.

నిమ్మకాయ నీరు తాగితే అందులోని ఆల్కలైజింగ్ లక్షణాలు శరీరంలో పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

Image Source: Pexels

రెండింటిలో ఏదొకటి తాగడం కంటే.. వేసవిలో ఈ రెండూ తాగడం చాలా ముఖ్యం. ఈ రెండు పానీయాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.