Image Source: pexels

జీర్ణక్రియను పెంచే ఫైబర్ ఫుడ్స్ ఇవే.

పుచ్చకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రేగు కదలికలను సాఫీ చేస్తుంది.

దోసకాయల్లో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

టొమాటోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. లైకోపిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఓట్స్ బీటా గ్లూకాన్ ను కలిగి ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కాయధాన్యాలు, చిక్ పీస్, బీన్స్ వంటి చిక్కుళ్లలో కరిగే ఫైబర్ ఉటుంది. ప్రొటీన్లు కూడా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి.

యాపిల్స్, నారింజ, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ప్రేగులకు మేలు చేస్తుంది.

చిలగడదుంపలు, క్యారెట్ రూట్ వెజిటెబుల్స్ వంటి రుచికరమైనవి మాత్రమే కాదు..ఇందులో ఫైబర్ ఉంటుంది.

అవిసెగింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. మ్యూకిలేజ్ గమ్ రూపంలో ఉంటుంది. వాటిలో ఓమేగా 3 కొవ్వులు కూడా ఉంటాయి.

బాదం, వాల్నట్స్ , జీడిపప్పు వరకు అన్ని రకాల నట్స్ మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

Image Source: pexels

అవోకాడోలో ఫైబర్, కొవ్వులు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ప్రేగు కదలికలను నియంత్రిస్తే జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.