మొటిమల మచ్చలు తొలగించుకునే సహజ పద్ధతులు ఇవే

టీట్రీఆయిల్ తో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. రోజూ దీన్ని ముఖానికి రాసుకోవాలి.

ఐస్ ముక్కను ఒక వస్త్రంలో చుట్టి ముఖం మీద మసాజ్ చేసుకోవాలి. మొటిమల మీద రుద్దే సమయంలో జాగ్రత్తగా చెసుకోవాలి.

శనగ పిండి లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.

ఆలోవెరా జెల్ మొటిమలకు రాయడం వల్ల మొటిమల కలిగే అసౌకర్యం తగ్గుతుంది. మచ్చలు ఏర్పడకుండా ఉంటుంది.

దాల్చిన చెక్క పొడికి ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి కొద్ది సమయం పాటు ముఖం మీద ఉండనిచ్చి చల్లని నీటితో కడిగెయ్యాలి.

చర్మం మీద ఏదైనా కొత్తగా వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే