సోయాబీన్స్‌లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అయితే దీనితో తయారు చేసే నూనె గురించి మీకు తెలుసా? అవును సోయాబీన్ నూనె జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందంటున్నారు నిపుణులు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి పోషణ అందిస్తాయి. జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. పొడి జుట్టుకు తేమను అందించడంలో సోయాబీన్స్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలతో సోయాబీన్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేయవచ్చు. రెగ్యూలర్‌గా జుట్టుకు ఈ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల పెరుగుదల మంచిగా ఉంటుంది. ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదించి తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)