పుదీన సహజంగానే చాలా చల్లని భావన కలిగిస్తుంది. పుదీన టీ లేదా పుదీన నూనె శరీరంలో వేడి తగ్గిస్తుంది. చామోమిలె ఒక రకమైన చామంతి. దీనితో కాచిన టీ తాగితే మెదడు చల్లబడి ఒకరకమైన రిలాక్సింగ్ గా ఉంటుంది. శరీరం చల్లబడుతుంది . లెమన్ బామ్ దీన్ని నిమ్మతైలం ఆకు అంటారు. దీన్ని నీళ్లలో వేసుకుని తాగొచ్చు, టీ కాచుకుని లేదా చల్లని పానీయాలకు కూడా కలుపుకోవచ్చు. సోంపు గింజలు జీర్ణక్రియకు తోడ్పడుతాయి. టీ రూపంలో తీసుకుంటే శరీరాన్ని చల్లబరుస్తాయి. ధనియాలను సలాడ్ లలో లేదా కూరల్లో వాడుతారు. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. బాసిల్ అనే ఈ ఆకును గణపత్రి అంటారు. దీని గింజలు, ఆకులు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. సలాడ్లు, పానీయాల్లో వాడుతారు. గులాబి రేకులు నీటిలో కలుపుని తాగితే చల్లని భావన కలిగిస్తాయి. చాలా రకాల పానీయాలకు, డెసెర్ట్ లకు ఉపయోగిస్తారు. వేసవిలో కలబంద జ్యూస్ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. శరీరంలో వేడి పెరగనివ్వదు. ఇది వేసవి డ్రింక్స్ లో చాలా పాపులర్. స్పియర్మింట్ కూడా పుదీనా వంటిదే. దీన్ని సలాడ్ లలో టీ కాచేందుకు ఉపయోగిస్తారు. సెలాంట్రో కొత్తిమీర లాంటి ఒక ఆకు. దీనికి కూడా శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉంటుంది. రకరకాల వంటకాల్లో వాడుతారు.