భారతీయ మగాళ్లకే బాన పొట్ట ఎందుకు వస్తుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Published by: Suresh Chelluboyina

మన దేశంలో మగాళ్లకు ఒక వయస్సు దాటిన తర్వాత పొట్ట ముందుకు చొచ్చుకొస్తుంది.

గుండ్రంగా, బంతిలా ఉండే మగాళ్ల పొట్టను చూసి చాలామంది నవ్వుకుంటారు.

ఇలాంటి పొట్టలు ఎక్కువగా భారతీయ మగాళ్లకే ఎక్కువగా ఉంటాయట.

ఇందుకు కారణం.. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులేనని నిపుణులు అంటున్నారు.

పొత్తి కడుపు ప్రాంతంలో ఉండే కొవ్వు నిక్షేపణ వల్ల బానపొట్ట ఏర్పడుతుంది.

హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాల పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుంది.

చాలావరకు భారతీయ వంటకాల్లో పోషకాలు తక్కువగా ఉంటాయట.

అలాగే ఇన్సులిన్ సమస్యల వల్ల హార్మోన్లలో సమస్యలు వస్తాయి. దానివల్ల గ్లూకోజ్ కొవ్వుగా మారుతుంది.

ఫలితంగా.. ఆ కొవ్వు కాస్తా.. స్థూలకాయానికి దారితీస్తుంది. దానివల్ల అనేక రోగాలు కూడా వస్తాయి.