గుండెనొప్పా? గ్యాస్ ప్రాబ్లమా? ఎలా తెలుసుకోవాలంటే? చాలా మంది గుండెనొప్పి, గ్యాస్ నొప్పికి తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. తీవ్రమైన ఆయాసం, గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట గుండె నొప్పి లక్షణాలు. దవడ, మెడ, చేతులు, భుజాల దగ్గర నొప్పి కూడా గుండెనొప్పి లక్షణాలు. పొట్ట ఉబ్బడం, కడుపులో మంట, ఛాతిలో మంట కలిగితే గ్యాస్ నొప్పిగా భావించాలి. సాధారణంగా తిన్నవెంటనే గ్యాస్ లక్షణాలు కనిపిస్తాయి. తినడంతో సంబంధం లేకుండా గుండెనొప్పి లక్షణాలు కనిపిస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com