మీది హీట్ బాడీనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి! చాలా మందిని వేధించే ఆరోగ్య సమస్యలో వేడి చేయడం ఒకటి. తినే ఆహారంలో ఎక్కువగా మసాలాలు, నూనె ఉంటే బాడీ హీట్ చేస్తుంది. ఎక్కువ నాన్ వెజ్ తిన్నా, సరిగా డైజేషన్ కాకపోయినా, నీళ్లు సరిగా తాగకపోయినా వేడి చేస్తుంది. వేడి ఎక్కువ కావడం వల్ల మూత్రంలో మంట, కళ్లలో మంట, వేడిపొక్కులు వస్తాయి. దీర్ఘకాలంలో రక్తనాళాలు, ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వేడి తగ్గాలంటే జీర్ణ సమస్యలు తగ్గించుకోవడం ఉత్తమం. డైలీ చన్నీటితో స్నానం, లేదంటే చన్నీళ్లలో పాదాలు ఉంచడం మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com