కొబ్బరి పాల టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా? సాధారణ చాయ్ కంటే కొబ్బరి పాలతో తయారు చేసిన టీలో చాలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. కొబ్బరి పాలలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. మీ దాహాన్ని తీర్చుతుంది. కొబ్బరిపాలలో చైన్ ఫ్యాటీయాసిడ్స్ ఉన్నాయి. జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. భోజనం తర్వాత ఒక కప్పు టీ తాగండి. కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఈ టీ తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది. జీవక్రియను పెంచుతుంది. సమతుల్య ఆహారంలో కొబ్బరి మిల్క్ టీని చేర్చుకోండి. కొబ్బరి పాల టీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు అద్భుతం చేస్తాయి. కొబ్బరిపాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ టీ తాగితే ఒత్తిడి దూరం అవుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నిరోధించే యాంటీఆక్సిడెంట్లు ఇందులోఉన్నాయి. కొబ్బరి పాలలోని హైడ్రేటింగ్ లక్షణాలు మీ జుట్టుకు తేమను అందిస్తాయి. మృదువుగా మెరిసేలా చేస్తాయి.