లవంగాల్లో విటమిన్లు C, K ఫోలేట్, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి.

ఆయుర్వేదంలో లవంగాలను చాలా రకాల సమస్యలకు ఔషధంగా వాడుతారు.

రాత్రి పడుకునే ముందు లవంగ నీరు తాగితే రకరకాల అనారోగ్యాలు దూరమవుతాయి.

లవంగాల్లోని విటమిన్ C వల్ల ఇమ్యూనిటి బలపడుతుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను నివారిస్తుంది.

లవంగాల్లో యుజెనాల్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

లవంగ నీరు తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

అజీర్తి సమస్య వేధించే వారు రాత్రి నిద్రకు ముందు లవంగ నీరు తాగితే కడుపు ఉబ్బరంగా ఉండడం, అసిడిటి వంటి సమస్యలు రావు.

రాత్రి పూట గోరువెచ్చని లవంగ నీరు తాగితే మలబద్దకం కూడా ఏర్పడదు. జీవక్రియలు వేగవంతం అవుతాయి.

Image Source: Pexels, Pixabay, Unsplash

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే