జుట్టు ఆరోగ్యం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. ఆహారంలో మార్పులు స్కాల్ప్ ను జుట్టును బలంగా మారుతాయి. ఇక్కడ కొన్ని నాన్ వెజ్ ఆహారాలు జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాం. సాల్మన్ చేపలో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి జుట్టు పెరిగేలా చేస్తుంది. రొయ్యల్లో విటమిన్ B12, ఐరన్, జింక్ ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యానికి మంచిది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. గుడ్డులో ప్రొటీన్, రైబోఫ్లెవిన్ వంటి మినరల్స్ ఉంటాయి. నియాసిన్, పొటాషియం అన్నీ కలిసి జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తాయి. చికెన్ అంటేనే లీన్ ప్రొటీన్, విటమిన్ B కూడా ఉంటుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. ఆయిస్టర్ వంటి సీ ఫూడ్ తో కూడా జుట్టు రాలడం ఆగుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే