వేసవిలో కంటిచూపును కాపాడుకోండిలా ఎండలు తీవ్రమవుతున్నాయి. సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి కళ్లను కాపాడుకోవడం చాలా ముఖ్యం. సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత రేడియేష్ ను నుంచి తమ చర్మాన్ని కూడా కాపాడుకోవాలి. యూవీ కిరణాల నుంచి కళ్లను ఎలా రక్షించుకోవాలో చూద్దాం. యూవీ రేడిషన్ ఏడాది పొడవునా ఉంటుంది. శీతాకాలంలోనూ యూవీ కిరణాలు కళ్లకు ప్రమాదాన్నికలిగిస్తాయి. కంటిశుక్లం, మచ్చలు, కంటి క్యాన్సర్ వంటి కంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎండలో బయటకు వెళ్తున్న సమయంలో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం చాలా అవసరం. కంటి ఆరోగ్యాన్నికాపాడుకోవడం కోసం కంటి పరీక్షలు చాలా అవసరం. ఉదయం 10, సాయంత్రం 4 గంటల మధ్య సూర్యకాంతి ఎక్కువగా ఉండే సమయంలో బయట తిరగడం మానుకోవాలి. విటమిన్లు A,c, E, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. నారింజ, స్ట్రాబెర్రీ, కివీ, క్యారెట్, బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి కూరగాయలు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.