బెండకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందని చెబుతుంటారు. బెండకాయను నిత్యం ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బెండిలో ఫ్లెవనాయిడ్స్, ఫాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వాపు, గుండెజబ్బుల నుంచి రక్షిస్తాయి. ఓక్రాలో ఉంటే విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. బెండకాయలో కరిగే ఫైబర్ జీర్ణక్రియ, రక్తప్రవాహంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ కు మంచి ఆహారం. బెండకాయలను నిత్యం ఆహారంలో చేర్చుకుంటే ఇందులో ఉండే ఫైబర్ గుండెకు మేలు చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.