స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ వంటి బెర్రీ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తాయి.

అవకాడోలో ఆరోగ్యవంతమైన కొవ్వులతో పాటు విటిమిన్లు ఇతర పోషకాలు చర్మంలో సాగేగుణాన్ని నిలిపి ఉంచుతాయి.

సిట్రస్ పండ్లలో విటమిన్ C పుష్కలం. ఇది ఒక యాంటీఆక్సిడెంట్ కూడా కొల్లాజెన్ సింథసిస్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది.

దానిమ్మ గింజల్లో ఆంథోసియానిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ని నిలిపి ఉంచుతుంది.

కివిల్లో విటమిన్ C, E ఎక్కువ, ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి చర్మంలో ముడుతలు రాకుండా నివారిస్తాయి.

ఎరుపు ద్రాక్షలో ఉండే పోషకాలు యాంటీఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

వాటర్ మిలన్ లో లైకోపిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని సూర్యరశ్మి లోని యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది.

ఆపిల్ లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ సింథసిస్ కి ఉపయోగపడతాయి.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.