ఉదయాన్నే సోంపు నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ మాయం. సోంపును భారతదేశంలో విరిగా వాడుతుంటారు. సోంపు నీళ్లు తాగితే ప్రయోజనాలేంటో చూద్దాం. సోంపు నీళ్లు కడుపులో గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఉత్పత్తికి సహాయపడుతాయి. ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలంటే ప్రతిరోజూ సోంపునీళ్లు తాగాలని డైషీయన్స్ చెబుతున్నారు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే సోంపు నీళ్లు తాగితే అందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. పరగడుపున సోంపు నీళ్లు తాగితే రోజంతా హైడ్రేట్ గా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యం, దగ్గు, ఊపిరితిత్తులలో కఫం తగ్గాలంటే సోంపు తినడం మంచిది. సోంపులో యాంటీ బ్యాక్టీరియర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మొటిమలు, విరేచనాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.