సమ్మర్లో చాలామంది నిమ్మరసాన్ని రెగ్యూలర్‌గా తాగుతూ ఉంటారు. అయితే దీనిని రోజూ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? కచ్చితంగా లేవు కానీ అధిక మొత్తంలో కాకుండా లిమిటెడ్‌గా తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమ్మర్లో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కూల్ డ్రింక్స్‌కి బదులు నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. దీనిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండవల్ల కలిగే ఇబ్బంది, చిరాకు, వేడిని తగ్గించి.. దాహాన్ని తగ్గిస్తుంది. సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో చర్మం ఎక్కువ టాన్ అవుతుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని రక్షిస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదించి తాగితే మంచిది. (Images Source : Unsplash)