ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో బొప్పాయి తీసుకుంటే ప్రొటీన్ల జీర్ణక్రియను వేగవంతం చేసి అజీర్తి సమస్య రాకుండా కాపాడుతుంది. బొప్పాయిలో అల్ఫా హైడ్రాక్సి ఆసిడ్ ఉంటుంది. దీని వల్ల చర్మం మెరుపు సంతరించుకుని యవ్వనంగా ఉంటుంది. బొప్పాయిలో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బొప్పాయిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పీరియడ్ నొప్పి నివారిస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ను ఉత్పత్తి పెంచుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. బొప్పాయి వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. కనుక రోజూ ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా బొప్పాయి చేర్చుకోవడం మరచిపోవద్దు. ఈ సమాచారం కేవలం అవగాహాన కోసం మాత్రమే