వేసవి వచ్చిందంటే మామిడికాయల సందడి మొదలవుతుంది.

పచ్చి మామిడి లో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పచ్చి మామిడిలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. చర్మం యవ్వనంగా ఉంటుంది.

ఆస్ట్రింజెంట్ గుణాల వల్ల పచ్చిమామిడి నోటి ఆరోగ్యానికి కూడా మంచిది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

పచ్చిమామిడిలో జీర్ణ ఎంజైములు ఉంటాయి. కనుక జీర్ణక్రియ సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది.

పచ్చి మామిడిలో విటమిన్ A ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరం.

పచ్చి మామిడితో రక్తంలో షుగర్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే